»Young Man Stole Lakhs Of Rupees To Give Gift To Girlfriend
Uttar Pradesh : ప్రియురాలికి గిఫ్ట్ ఇచ్చేందుకు స్కూల్లో దొంగతనం చేసిన ఘనుడు
Uttar Pradesh : ప్రేమ గుడ్డిది అని అంటారు(Love Is Blind). ఒక వ్యక్తి ప్రేమలో పడితే ఏ పని చేయడానికైనా వెనకాడడు. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని షామ్లీలో చోటుచేసుకుంది. ప్రియురాలి(LOver)కి బహుమతి(Gift) ఇవ్వాలని ఓ యువకుడు తన సహచరుడితో కలిసి స్కూల్లో(School) లక్షల రూపాయలు దోచుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది.
Uttar Pradesh : ప్రేమ గుడ్డిది అని అంటారు(Love Is Blind). ఒక వ్యక్తి ప్రేమలో పడితే ఏ పని చేయడానికైనా వెనకాడడు. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని షామ్లీలో చోటుచేసుకుంది. ప్రియురాలి(LOver)కి బహుమతి(Gift) ఇవ్వాలని ఓ యువకుడు తన సహచరుడితో కలిసి స్కూల్లో(School) లక్షల రూపాయలు దోచుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం కేసు షామ్లీ జిల్లాలోని సదర్ కొత్వాలి ప్రాంతానికి సంబంధించినది. ఏప్రిల్ 17 రాత్రి గుర్తు తెలియని దొంగలు స్కాటిష్ ఇంటర్నేషనల్ స్కూల్లో చోరీకి పాల్పడ్డారు. పాఠశాలలోని క్యాష్ కౌంటర్లో ఉంచిన సుమారు రూ.6.5 లక్షల నగదును అపహరించారు(stole money from school).
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు(Police).. అవగాహన ఉన్న వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు సీసీటీవీ(CCTV), ఇతర ఆధారాల ద్వారా దర్యాప్తు ప్రారంభించారు. పాఠశాలలో చోరీకి పాల్పడిన వ్యక్తి స్కూల్ వ్యాన్ డ్రైవర్(School Van Driver) అని పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. పోలీసులు అతడిని విచారించగా.. సుఫియాన్(Sufian) అనే వ్యక్తి తన స్నేహితుడు వసీమ్తో కలిసి చోరీకి పాల్పడినట్లు తేలింది. విచారణలో, తనకు దొంగతనం చేయాలనే ఉద్దేశం లేదని.. అయితే ప్రేమ కారణంగా తన ప్రియురాలికి గిఫ్ట్ ఇవ్వాలని భావించి అలా చేశానని సుఫియాన్ చెప్పాడు.
పాఠశాల(School)లో దోపిడీకి తన సహచరుడితో కలిసి కుట్ర పన్నాడు. స్కూల్లోనే డ్రైవర్(Driver)గా పనిచేసేవాడు కాబట్టే అతనికి డబ్బులు ఎక్కడ దాస్తారో తెలిసిపోయింది. అనంతరం సహచరుడితో కలిసి చోరీకి ప్లాన్ చేశాడు. పాఠశాల వెనుక వైపు నుంచి లోపలికి ప్రవేశించి క్యాష్ కౌంటర్ గది అద్దాలను స్క్రూడ్రైవర్(screw driver)తో పగులగొట్టి అక్కడి నుంచి లోపలికి ప్రవేశించి నగదు(Money)తో పరారయ్యాడు.
కేసుకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ.. అదే రోజు రాత్రి చోరీకి పాల్పడ్డానని, దోచుకున్న సొమ్మును రెండు భాగాలుగా చేసి సుమారు రూ.1.5 లక్షలు తన వద్ద ఉంచుకున్నానని నిందితుడు సుఫియాన్ చెప్పాడని తెలిపారు. మిగిలిన 50 వేల రూపాయలను తన సహచరుడికి ఇచ్చాడు. దొంగతనం జరిగిన తర్వాత మిగిలిపోయిన డబ్బుతో గిఫ్ట్ ప్యాక్(Gift Pack) తయారు చేసి వెళ్లి పక్కనే ఉన్న గ్రామంలోని తన స్నేహితుడికి ఇచ్చి.. నేను చెప్పే వరకు గిఫ్ట్ తెరవవద్దని చెప్పాడు.. ఈ బహుమతి ప్రేమతో ఇచ్చినట్లు చెప్పాడు. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.