ఢిల్లీకి చెందిన పీఆర్ సంస్థ ఎలైట్ మార్క్ తమ ఉద్యోగులకు దీపావళి సందర్భంగా అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఏకంగా 9 రోజుల సెలవులు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ పంపిన మెయిల్ లింక్డిన్లో వైరల్ అవుతోంది. రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థ ఎంబసీ గ్రూప్ కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులకు ఈనెల 18 నుంచి 26 వరకు సెలవులు ప్రకటించినట్లు తెలిపింది.