TG: హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కళాశాలలో రూ.కోటి చోరీకి గురైంది. దుండగులు కాలేజీలో రూ.కోటి నగదును ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కళాశాల పరిసరాల్లో సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించారు. చోరీకి పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నారు.