NLR: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్టోబర్ 15 (బుధవారం) జిల్లాలో పర్యటించనున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం ఈదగాలిలో నందగోకులం లైఫ్ స్కూల్‌ను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడతారు. తర్వాత సమీప గోశాలకు వెళ్లి నంది పవర్ ట్రెడ్ మిల్, విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు.