GNTR: అనపర్రు బీసీ బాలుర హాస్టల్లో అస్వస్థతకు గురైన 17 మంది విద్యార్థులను వైసీపీ ఇన్ఛార్జి బలసాని కిరణ్ కుమార్ పరామర్శించారు. శుక్రవారం ఆయన పెదనందిపాడు పీహెచ్సీకి వెళ్లి విద్యార్థులను కలిశారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను, హాస్టళ్లలో మౌలిక వసతులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. హాస్టల్లో వార్డెన్ లేకపోవడం దురదృష్టకరమన్నారు.