ATP: గుత్తి మండలం బేతపల్లి గ్రామంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో భారీ వర్షానికి వేరుశనగ పంటలు నీట మునిగాయి. బాధిత రైతు సుధాకర్ మాట్లాడుతూ.. పది ఎకరాలలో వేరుశనగ పంట సాగు చేశానని అకాల వర్షంతో పంట మొత్తం నీటిలో మునిగిపోయిందన్నారు. సుమారు రూ.4 లక్షల మేర ఆస్తి నష్టం వాటిలిందన్నారు. తనను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతు కన్నీరు మున్నీరయ్యాడు.