W.G: వైసీపీ గ్రీవెన్స్ సెల్ జాయింట్ సెక్రటరీగా ఈరంకి కాశీ విశ్వనాథం ఇటీవల నియమితులయ్యారు. శుక్రవారం పాలకొల్లు వైసీపీ కార్యాలయంలో ఇంఛార్జ్ గుడాల గోపి, మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ యడ్ల తాతాజీలను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ, కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నాయకులు తనకు సూచించినట్లు కాశీ తెలిపారు.