HYD: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆలిండియా ఓబీసీ, దళిత బహుజన స్టూడెంట్ అసోసియేషన్లు నిరసన చేపట్టాయి. నాయకులు మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ చట్టానికి హైకోర్టులో సవాళ్లు ఎదురవుతున్నందున, శాశ్వత న్యాయ రక్షణకోసం 9వ షెడ్యూల్లో చేర్చాలని కోరారు.