WNP: వనపర్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణంలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ‘వరల్డ్ మెంటల్ హెల్త్ డే’ను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి. ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే అంశంపై సుదీర్ఘంగా మాట్లాడి అవగాహన కల్పించారు. మనం మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే దేశం, ప్రపంచం అంతా ఆరోగ్యవంతంగా తయారవుతుందన్నారు.