NDL: చీఫ్ జస్టిస్ గవాయిపై చెప్పుతో దాడి చేసిన రాకేష్ కిషోర్‌ను అరెస్టు చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. నాగేశ్వరావు డిమాండ్ చేశారు. నంది కోట్కూరులోని కార్యాలయంలో నాయకుల సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ సుప్రీంకోర్టు న్యాయవాదులు సమక్షంలో మతోన్మాది న్యాయవాది రాకేష్ కిషోర్ బూటు విసిరివేసి దాడి చేయడం విచారకరమన్నారు.