KNR: కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ లేకపోవడం వల్లే బీసీ రిజర్వేషన్ల విషయంలో అభాసుపాలైందని ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు ఇస్తుందన్నారు. రాజ్యాంగ సవరణ హక్కు పార్లమెంటుకే ఉంటుందనే విషయం తెలిసీ కాంగ్రెస్ డ్రామా ఆడిందని ఎంపీ ఆరోపించారు. పాత బిల్లులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.