MNCL: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాలలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు నరెడ్ల శ్రీనివాస్, వడ్డేపల్లి మనోహర్ మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు బీసీ మెజార్టీ ప్రజల మనోభాలకు వ్యతిరేకంగా ఉందన్నారు. మెజారిటీ ప్రజలైన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.