అన్నమయ్య: ఏఆర్ సిబ్బంది సంక్షేమం, క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తూ.. సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సూచించారు. ఈ మేరకు రాయచోటి ఏఆర్ పరేడ్ మైదానంలో జరిగిన వీక్లీ పరేడ్లో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం దర్బార్లో మాట్లాడిన ఎస్పీ సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి సారించాలని, యోగా, ధ్యానం, వ్యాయామం అలవాటు చేసుకోవాలని సూచించారు.