KMR: నల్గొండ జిల్లాకు పీసీసీ అబ్జర్వర్‌గా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బద్ధం ఇంద్రకరణ్ రెడ్డిని నియమిస్తూ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బిక్కనూరు మండలానికి చెందిన ఇంద్రకరణ్ రెడ్డికి నల్గొండలో డీసీసీ నూతన కమిటీలను ఏర్పాటు చేసే బాధ్యతను అప్పగించారు. పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయాలన్నారు.