GDWL: సమాచార హక్కు చట్టం (RTI) ప్రభుత్వ అధికారుల పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందించబడిందని కలెక్టర్ సంతోష్ అన్నారు. ఈ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్గి ఉండాలని పేర్కొన్నారు. ఈనెల 5 నుంచి 12 వరకు ఆర్టీఐ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఇవాళ జిల్లా కార్యాలయంలో అధికారులకు చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించారు.