KDP: మైదుకూరు పోలీసులు శుక్రవారం రైతుల పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి కాపర్ వైర్లు దొంగతనం చేస్తున్న ఆరుగురు దొంగలను అరెస్ట్ చేశారు. DSP రాజేంద్రప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుల నుండి ఒక బొలెరో, 3 బైకులు, సుమారు రూ.2 లక్షల విలువైన 150 కిలోల కాపర్ వైర్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయినవారు నెల్లూరు జిల్లాకు చెందినవారుగా గుర్తించారు.