అన్నమయ్య: వినియోగదారులకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యమని విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ సురేందర్ నాయుడు అన్నారు. గురువారం రాయచోటిలోని విద్యుత్ సర్కిల్ ఆఫీస్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ ఉపకేంద్రాలు, లైన్ల మరమ్మత్తులు సకాలంలో చేయాలని, కొత్త కనెక్షన్లు ఎస్వోపీ ప్రకారం మంజూరు చేయాలని సూచించారు.