BHNG: సంస్థాన్ నారాయణపురం మండలంలోని రాచకొండ గుట్టలను పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. ఇక్కడి వాటర్ ఫాల్స్ సినిమా షూటింగ్‌లకు, పర్యాటకులకు ఎంతగానో ఉపకరిస్తుందని చెబుతున్నారు. గతంలో ఇక్కడ షూటింగ్‌లు జరిగాయని, అలాగే ఈ ప్రాంతంలో ఒక శివాలయం బయటపడిందన్నారు. ప్రభుత్వం పర్యాటకంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు.