TG: స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా చేపట్టిన ఉద్యమంలో భాగంగా బీసీ ఐకాస ఇవాళ రాష్ట్ర బంద్‌ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి. బీసీ సంఘాల నేతలు తెల్లవారుజామునే రోడ్లపైకి వచ్చి బంద్‌లో పాల్గొన్నారు. ఉదయాన్నే ఆయా జిల్లాల్లోని బస్ డిపోల వద్ద బీసీ సంఘాల నేతలు బైటాయించారు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.