జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) హత్యకు కుట్ర జరిగిందని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్త వినగానే… వైసీపీ నేతలే ఈ కుట్ర చేస్తున్నారంటూ పవన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. మరికొందరి వాదన మాత్రం మరోలా ఉంది. జనసేన నేతలు పబ్లిసిటీ కోసం ఈ విధంగా ప్రచారం చేసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
కాగా… పవన్ పై మాత్రం కుట్ర జరిగిందని… ఇందులోభాగంగానే, హైదరాబాద్ నగరంలోని ఆయన ఇంటివద్ద రెక్కీ నిర్వహిచారు. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖ పరిణామాల తర్వాత పవన్ కళ్యాణ్ నివాసం, కార్యాలయం వద్ద కొత్త వ్యక్తులు సంచరించడాన్ని గుర్తించామని ఆయన తెలిపారు.
ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి బయటకు వెళుతున్నపుడు తిరిగి వస్తున్నప్పుడు ఆయన వాహనాన్ని కొన్ని అనుమానాస్పద వాహనాలు వెంబడిస్తున్నాయని నాదెండ్ల చెప్పారు. ఆ వాహనాల్లో పవన్ కారును నిశితంగా పరిశీలిస్తున్నారని, వారు అభిమానులు మాత్రం కారని ఆయన వ్యక్తిగత భద్రతా సబ్బంది చెబుతున్నారని తెలిపారు.
మంగళవారం కారులోనూ, బుధవారం బైకులపై పవన్ వాహనాన్ని అనుసరించారని తెలిపారు. అంతకుముందు సోమవారం అర్థరాత్రి ముగ్గురు వ్యక్తులు వచ్చి పవన్ నివాసం వద్ద గొడవ చేశారని ఆయన చెప్పారు. పవన్ ఇంటి వద్ద ఎదురుగా వారు కారు నిలుపగా సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకోబోయారని దాంతో బూతులు తిట్టడం మొదలుపెట్టారని ఆయన వివరించారు.