AP: తిరుమలలో లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదాల నాణ్యత పెరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. పురోహితులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్రంలో ఉగాది పండగ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. లడ్డూ ప్రసాదం రుచిగా ఉందని భక్తులకు సూచించారు.