AP: మాజీ సీఎం జగన్ శవ రాజకీయాలు మానుకోవాలని మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. పరిశ్రమలు వస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. గూగుల్ వస్తున్నందుకు దేశం మొత్తం గర్విస్తుంటే.. వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు.