»Bumperafar For Those Who Buy A New Scooter Rs 30 Thousand Discount
Electric scooter : ఏథర్ కొత్త స్కూటర్ కొనే వారికి బంపరాఫర్.. రూ.30 వేల తగ్గింపు
ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్ వెహికల్ కంపెనీ ఏథర్ ఎనర్జీ (Ather Energy) నుంచి సరికొత్త ఈవీ స్కూటర్ వచ్చేసింది.ఏథర్ ఎనర్జీ కంపెనీ కొత్త ఏథర్ 450 ఎక్స్ స్కూటర్ ని లాంచ్ చేసింది. దీని ధర పాత ధరకంటే రూ. 30,000 తక్కువే ఉంచింది.
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ (Aether Energy) వాహదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric scooter) కొనే వారికి రూ.30 వేల భారీ తగ్గింపు ప్రకటించింది. ఓలా (OLA), టీవీఎస్లకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏథర్ ఎనర్జీకి గట్టి పోటీ ఇస్తున్నాయి. తక్కువ ధరకే అత్యాధునిక ఫీచర్లను అందిస్తున్నాయి. ఫలితంగా ఏథర్ అమ్మకాలు తగ్గాయి. దీంతో నష్ట నివారణ చర్యలకు దిగిన ఏథర్ కంపెనీ.. ఏథర్ 450 ప్లస్ పేరిట ఉన్న వేరియంట్(Variant)ను తొలగించింది.ఏథర్ 450 ఏక్స్ను మాత్రమే అందుబాటులో ఉంచింది. దీని ధరను రూ.30 వేలు తగ్గించింది. అందు కోసం ఈ మోడల్లో రైడ్ మోడ్స్, టచ్ స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి సౌలభ్యాలను తీసివేసింది. వాటితో పాటు ఫాస్ట్ ఛార్జింగ్(Fast charging), మ్యూజిక్, కాల్స్, మ్యాప్స్, మొబైల్ కనెక్టివిటీ వంటి వాటినీ మినహాయించింది.
విద్యుత్ శ్రేణి వాహనాల తయారీ, విక్రయాల్లో పోటీ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ల విషయంలో ఈ పోటీ మరింత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు తమ ప్రత్యర్థుల కన్నా అధిక ఫీచర్లు(More features) లేదా, తక్కువ బడ్జెట్ (Budget) లో వాహనాలను అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ కూడా ఓ కీలకమైన నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఏథర్ 450ఎక్స్ మోడల్లో కొన్ని టెక్నికల్ మార్పులు చేసి అందుబాటు ధరలో మార్కెట్లో లాంచ్ చేసింది. ఏకంగా బైక్ పై రూ. 30వేలు ధరను తగ్గించడం విశేషం