TG: శాసనసభ ప్రాంగణం రూపురేఖలను పూర్తిగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. పార్లమెంట్ ప్రాంగణం తరహాలో అసెంబ్లీ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని అధికారులను అదేశించారు. పబ్లిక్ గార్డెన్లో అసెంబ్లీ సభ్యుల కోసం ప్రత్యేకంగా ఓ క్లబ్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి సెంట్రల్ హాల్ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు.