HNK: జనగణన-2027 కార్యక్రమంలో భాగంగా బాలసముద్రంలోని MLA క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్వీయ గణన ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన కుటుంబ వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.