MHBD: తొర్రురు మండలం హరిపిరాల గ్రామం కాశగూడెంకు చెందిన షేక్ రేష్మకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108కు సమాచారం అందించారు. ఈఎంటీ దయాకర్, పైలట్ రవిలు అంబులెన్స్‌లో సదరు మహిళను వరంగల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు. రేష్మ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.