KRNL: తుగ్గలిలో కౌలు రైతు గుర్తింపు కార్డు అర్హత ఉన్నవారికే ఇస్తామని వ్యవసాయాధికారి సురేష్ బాబు తెలిపారు. భూమి యజమాని కాకుండా కౌలుకు తీసుకుని సాగు చేసే రైతులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. అవసరమైన పత్రాలు, ఒప్పందాలు తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. ఈ కార్డు ద్వారా పంట రుణాలు, సబ్సిడీలు, భీమా వంటి ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు.