ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ యాషెస్ టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ తన ఆశల్ని నిలుపుకున్నది. అయితే మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన బౌలింగ్ వీడియో నెట్టింట్ వైరల్ గా మారింది.
Australian bowler Mitchell Starc's amazing bowling.. Clean bold Main Ali video viral
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ టీమ్ మూడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో యాషెస్ టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ తన ఆశల్ని నిలుపుకున్నది. అయితే హెడ్డింగ్లీలో జరిగిన మ్యాచ్‌లో నాలుగవ రోజు 251 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఓ భారీ జలక్ తగిలింది. వన్ డౌన్లో వచ్చిన మొయిన్ అలీని.. పేస్ బౌలర్ స్టార్క్ తన అద్భుతమైన బౌలింగ్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆస్ట్రేలియాను ఎదుర్కొనేందుకు మొయిన్ అలీని మిడిల్ ఆర్డర్ లో కాకుండా వన్ డౌన్ లో పంపించారు. రాణిస్తాడు అనుకున్న అలీ కేవలం 5 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ అవుట్‌కు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన హ్యారీ బ్రూక్, క్రిస్ వోక్స్‌లు సిరీస్‌లో ఇంగ్లండ్ ఆశల్ని నిలిపారు.
ఈ యాషెస్ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 263 తొలి రోజే పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (118) సెంచరీతో అదరగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 237 పరుగులకే కుప్పకూలిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 224 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ ముంగిట 251 పరుగుల లక్ష్యంతో భరిలో దిగిన ఇంగ్డాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి పోరులో నిలిచింది.