»Bad Hair Day Womens Hair Gets Tangled In Electric Whisk Viral Video
Viral video: వంట చేసేటప్పుడు జడ వేసుకోవాలి..లేకుంటే ఇలానే జరుగుద్ది!
ప్రస్తుత రోజుల్లో చాలా మంది హెయిర్ ని ఫ్రీగా వదిలేయడానికే ఇష్టపడతారు. కానీ వంట చేసే సమయంలో మాత్రం జుట్టు అలా వదిలేస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి సాక్ష్యం ఇదే. తాజాగా ఓ మహిళ దీనికి సంబంధించిన వీడియో షేర్ చేసింది. అది చూసి అందరూ భయపడిపోతున్నారు.
Bad Hair Day Women's Hair Gets Tangled In Electric Whisk viral video
ప్రస్తుతం మనకు మార్కెట్లో, ముఖ్యంగా వంట గదిలో ఉపయోగించడానికి చాలా వస్తువులు వచ్చాయి. వాటి ద్వారా వంట చేయడం సులభమౌతోంది. ఆదునిక వంటగది గాడ్జెట్లు, స్మార్ట్ ఉపకరణాలు స్నేహపూర్వక యాప్లు అనేక రకాల వంటకాలను,వాటితో ప్రయోగాలు చేయడానికి ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. అయినప్పటికీ మనం అప్పుడప్పుడు ఊహించని సమస్యలను ఎదుర్కొంటున్నాము. ఇది ప్రమాదాలకు కూడా దారి తీస్తుంది.
ఒక మహిళ(women) ప్రమాదవశాత్తూ తన ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్ ని ఉపయోగిస్తున్నప్పుడు ఆమె తన బేకింగ్ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రమాదానికి గురైంది. ఆమె జుట్టు వెళ్లి ఓ గ్యాడ్జెట్ లో ఇరుక్కుంది. వెంటనే స్విచ్ఛ్ ఆఫ్ చేయడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె బేకింగ్(baking) చేస్తూ వంట గురించి వివరిస్తున్నారు. ఆమె సరదాగా కెమెరాలో నిమగ్నమై మాట్లాడుతుండగా, ఆమె వెంట్రుకలు ఆ గ్యాడ్జెట్ లో ఇరుక్కుపోయింది.
ఊహించని పరిణామంలో ఆమె జుట్టులో కొంత భాగం పరికరంలో చిక్కుకుపోయి, ఆమె ఒక అడుగు వెనక్కి వేసి, ఆశ్చర్యంతో కేకలు వేయడంతో ఒక్కసారిగా భయాందోళనలకు దారి తీస్తుంది. అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి బయటపడింది. సోషల్ మీడియా(social media)లో వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా చూసేయండి మరి. ఈ వీడియో చూసిన తర్వాత, వంట చేసే సమయంలో, ముఖ్యంగా ఇలాంటి వస్తువులు ఉపయోగించే సమయంలో జుట్టు ముడివేసుకోవాల్సిందేనని అనేక మంది కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.