»Karnataka Cm Siddaramaiah Speech Video Viral Social Media Ktr Tweet
Karnataka CM: ఫేక్ వీడియో వైరల్..కేటీఆర్ ట్వీట్
ప్రస్తుతం సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ నేత, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీటిపై తాజాగా తెలంగాణ బీఆర్ఎస్ నేత కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
Karnataka CM siddaramaiah speech video viral social media KTR tweet
తెలంగాణలో ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఆ క్రమంలో ప్రకటించిన ఆరు హామీలను అమలు చేస్తామని ఇప్పటికే తెలంగాణ మంత్రులు చెబుతున్నారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. మరో రెండు గ్యారెంటీలను ఈనెల 28న ప్రారంభిస్తామని అంటున్నారు. అంతేకాదు ఇటివల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సహా పలువురు మంత్రులు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో కర్ణాటక సీఎం(siddaramaiah speech) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ట్యాగ్ చేసి వీడియోను రీ పోస్ట్ చేసి రియాక్ట్ అయ్యారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎన్నికల వాగ్దానాలు/హామీలు అమలు చేయడానికి తమ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని చెప్పడం వీడియోలో కనిపిస్తుంది. అయితే దీనిపై స్పందించిన బీఆర్ఎస్ నేత కేటీఆర్(KTR) ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి తెలంగాణలో గెల్చిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందా అని ఎద్దేవా చేశారు. అంతేకాదు హామీలు ప్రకటించే ముందు కనీస ప్రాథమిక పరిశోధన, ప్రణాళిక చేయాల్సిన అవసరం ఉందన్నారు.
No money to deliver poll promises/guarantees says Karnataka CM !
Is this the future template for Telangana too after successfully hoodwinking the people in elections ?
Aren’t you supposed to do basic research and planning before making outlandish statements? https://t.co/JOcc4NLsiq
అయితే ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తుండగా..మరికొంత మంది మాత్రం అనేక రకాలుగా కామెంట్లు(comments) చేస్తున్నారు. అంతేకాదు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలల కాకముందే ఇలా వాళ్లు ప్రకటించిన హామీల గురించి అలా ఎద్దేవా చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో కూడా నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం సహా అనేక హామీలను అమలు చేయలేదని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు ఈ వీడియో ఫేక్ ఎడిటింగ్ వీడియో అని కూడా చెబుతున్నారు.