నందమూరి బాలకృష్ణను హోస్ట్‌గా చేయించే సాహసం ఎవరు చేయరు.. చేయలేరు కూడా.. కానీ మెగా ప్రొడ్యూసన్ అల్లు అరవింద్ మాత్రం.. బాలయ్యతో టాక్ షో చేసి చూపించాడు. ఇక బాలయ్య హోస్టింగ్ అన్‌స్టాపబుల్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది.. అంతేకాదు టాక్ షోలకు అమ్మ మొగుడిలా నిలిచింది. అందుకే అల్లు అరవింద్‌ను ప్రొడ్యూసర్స్లలో కింగ్ అని చెప్పొచ్చు. ఇక ఆహా వేదికగా కంటెంట్ ఉన్న సినిమాలే కాదు.. సరికొత్త కంటెంట్‌తో అభిమానులతో ఆహా అనిపిస్తున్నారు అల్లు అరవింద్.
ప్రస్తుతం బాలయ్య అన్‌స్టాబుల్ సెకండ్ సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో ఊహించని గెస్ట్‌లతో రచ్చ చేస్తున్నారు బాలయ్య. దాంతో ఇప్పుడు ఆహా ఓటిటి అంటేనే.. అన్ స్టాపబుల్ అయిపోయింది. ఇదే ఊపులో మరిన్ని షోలు చేస్తోంది ఆహా.. డైరక్టర్ అనీల్ రావిపుడితో కూడా ఒక కామెడీ షో ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఇప్పుడు అల్లు అరవింద్ మరో భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. అందుకోసం మన హాస్య బ్రహ్మను రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది.
త్వరలోనే బ్రహ్మానందం హోస్ట్‌గా మరో టాక్ షో ప్లాన్ చేస్తున్నట్టు ఆహా వర్గాల సమాచారం. ఇప్పటికే షో కాన్సెప్ట్ గురించి బ్రహ్మానందంతో చర్చించారట అల్లు అరవింద్. అందుకోసం బ్రహ్మికి భారీ పారితోషికం కూడా ఆఫర్ చేసినట్టు టాక్. అయితే ఇంకా అది చర్చల దశలోనే ఉందని తెలుస్తోంది. బ్రహ్మి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం.. వెంటనే ఈ కొత్త టాక్ షోను స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ షోని కూడా అన్‌స్టాపబుల్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించిన మరిన్నిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.