Boyapati Sreenu: అల్లు అరవింద్ కి షాకిచ్చిన బోయపాటి శీను!
దర్శకుడు బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన సరైనోడు సినిమా బన్నీ కెరీర్లో పెద్ద హిట్‌గా నిలిచింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 127 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దర్శక,నిర్మాతలు కలిసి మళ్లీ ఒక సినిమా కోసం కలిసి రావడంతో ప్రేక్షకులు ఉత్సాహంగా ఉన్నారు.
Boyapati Sreenu: దర్శకుడు బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన సరైనోడు సినిమా బన్నీ కెరీర్లో పెద్ద హిట్‌గా నిలిచింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 127 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దర్శక,నిర్మాతలు కలిసి మళ్లీ ఒక సినిమా కోసం కలిసి రావడంతో ప్రేక్షకులు ఉత్సాహంగా ఉన్నారు. దర్శకుడు, నిర్మాత ఇద్దరూ అధికారికంగా సహకరిస్తారని ప్రకటిస్తూ పోస్టర్ కూడా విడుదలైంది. అల్లు అర్జున్, బాలకృష్ణ లేదా సూర్యతో ఈ సినిమా ఉంటుందని అందరూ అనుకున్నారు. సూర్య చేతిలో చాలా సినిమాలున్నాయి. అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. పుష్ప తర్వాత అట్లీతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. దాంతో బాలకృష్ణతో సినిమా ఉంటుందని ప్రేక్షకులు భావించారు.
కానీ బోయపాటి ఊహించని షాకిచ్చాడు. ఆయన హీరో బాలకృష్ణ తో కలిసి బోయపాటి శ్రీను 14 రీల్స్ బ్యానర్లో ఓ సినిమా కోసం పనిచేస్తున్నారు. దాంతో బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను 14 ప్లస్ బ్యానర్‌ని ఎంచుకున్నట్లు అధికారిక సమాచారం. అల్లు అరవింద్‌కి ఇది రెండోసారి. మొదటిసారి పరశురామ్‌తో సినిమా చేస్తానని హామీ ఇచ్చాడు, అయితే విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన ఫ్యామిలీ స్టార్ కోసం దిల్ రాజు కాంపౌండ్‌కి వెళ్లాడు. అయితే, ఈ విషయంపై అల్లు అరవింద్ లేదా అతని బృందం ఇంకా స్పందించలేదు. ఈ లెక్కన అల్లు అరవింద్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
చదవండి:Happy Days: మళ్లీ థియేటర్స్ లోకి హ్యాపీడేస్ మూవీ?