AP: కలెక్టర్ల సదస్సులో భవిష్యత్ లక్ష్యాలపై ఇవాళ సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఆరు నెలల పాలనలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. శాంతి భద్రతలపైనా డీజీపీ, ఎస్పీలతో సమీక్షించనున్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్-2047 విజన్ డాక్యుమెంట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. వచ్చే నాలుగున్నరేళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశంపై చర్చించనున్నారు.