TG: యూనివర్సిటీల్లో త్వరలోనే పోస్టుల భర్తీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. విద్య, వైద్యశాఖలను గాడిలో పెడుతున్నామని అన్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నట్లు తెలిపారు. పదేళ్లలో బీఆర్ఎస్ ఇలాంటి ఆలోచన చేయలేదని విమర్శించారు. గత ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదన్నారు. ఈనెల 7 నుంచి 9 వరకు తెలంగాణ కార్నివాల్ నిర్వహించనున్నట్లు తెలిపారు.