TG: రేపు సాయంత్రం 5 గంటలకు భూ భారతి ప్రారంభం కానున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ‘జూన్2 లోపు 3 మండలాలలో పైలెట్ ప్రాజెక్ట్ నిర్వహిస్తాం. 5 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. భూ సమస్యలను పరిష్కరించేందుకు.. తహశీల్దార్‌తో పాటు అధికారులకు అవకాశం ఇస్తాం. త్వరలో 6 వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్ల నియమకం జరుగుతుంది’ అని పేర్కొన్నారు.