కర్నూలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రతి వార్డులో శానిటేషన్ బాగా లేదని, పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోడుమూరు MLA బొగ్గుల దస్తగిరి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెక్యూరిటీ సమస్యలు లేకుండా చూడాలని, ICUలో ఫ్లోరింగ్ సరిగ్గా లేదని దాన్ని సరి చేయాలని సూచించారు.