AP: ఇంటర్, ఒకేషనల్ కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ కళాశాల విద్యార్థులను మంత్రి లోకేష్ సన్మానించారు. ఉండవల్లిలోని నివాసంలో 52 మందితో ముఖాముఖి నిర్వహించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ల్యాప్టాప్లు, పతకాలు అందించారు. ప్రభుత్వ కళాశాలల్లో మంచి మార్కులు రావనే ముద్ర చెరిపేశారని వెల్లడించారు. కలల సాధనకు కష్టపడండని.. ప్రోత్సహించే బాధ్యత తమదన్నారు.