AP: అసత్య ఆరోపణలు చేస్తున్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత అన్నారు. అబద్ధాలను కావాలని ప్రచారం చేశారని మండిపడ్డారు. పింక్ డైమండ్ పేరుతో గతంలో ప్రభుత్వంపై బురదజల్లారని.. అసలు పింక్ డైమండే లేదని తేలిందన్నారు. పాస్టర్ ప్రవీణ్ విషయంలో కొందరు పాస్టర్లు దారుణంగా మాట్లాడారని ధ్వజమెత్తారు. మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.