ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి స్వామివారి నిత్య కైకరంకలను, అన్న ప్రసాద విభాగములు భద్రపరుచుకొనుటకు బళ్లారి వాసులు సహకారంతో ఐదు లక్షలతో నూతనంగా నిర్మించిన కోల్డ్ స్టోరేజ్‌ను మంగళవారం ఆలయ ఈవో వాణి, దాతలతో కలిసి ప్రారంభించారు. అనంతరం దాతల పేరు మీద ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.