MBNR: రూరల్ మండలం ఫతేపూర్ గ్రామంలో నేటి సాయంత్రం వడగండ్ల వర్షం కురిసింది ఈ వర్షం కారణంగా రైతులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. చేతికి వచ్చిన వరి పంటతో పాటు, మామిడి పంట కూడా కళ్ళముందే పాడైపోతుండడంతో మనోవేదనకు గురయ్యారు. ఇక ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురిసింది. అప్పటివరకు తీవ్ర ఉక్కపోతగా ఉన్న వాతావరణం చల్లబడిపోయింది.