ప్రకాశం: ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి షేక్ మహబూబ్ బాషా అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. గత కొంతకాలంగా కర్నూల్లోని ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న మహబూబ్ బాషా మృతి చెందారు. కాగా గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మిత్రుడిగా, టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తిగా మహబూబ్ బాషా అందరికీ సుపరిచితుడే.