ప్రకాశం: చీమకుర్తి మండలం పీ.నాయుడుపాలెం గ్రామంలో విద్యాశాఖ అధికారులు మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. కలేక్టర్ మాట్లాడుతూ.. బడి ఈడు పిల్లలు నూరు శాతం బడిలోనే ఉండాలన్నారు. వీటి కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, ఐసీడీఎస్ ప్రాజెక్టు సిబ్బంది, పాల్గొన్నారు.