MNCL: క్యాతన్ పల్లి మున్సిపల్ కార్యాలయాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. మున్సిపల్ కమీషనర్ రాజుతో కలిసి రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల ప్రక్రియ, రిజిస్టర్లు,మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి వివరాలను పరిశీలించారు. మున్సిపల్ పరిధిలోని ప్రతీ ఇంటికి త్రాగునీటిని అందించే విధంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు.