KMR: విశ్వ విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల సేవలను గుర్తించాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణగుప్తా డిమాండ్ చేశారు. బిక్కనూర్లోని జంగంపల్లి గ్రామ పరిధిలోగల సౌత్ క్యాంపస్లో చలో సెక్రటేరియట్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 17న విశ్వ విద్యాలయంలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల ఆధ్వర్యంలో చలో సెక్రటేరియట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.