సత్యసాయి: సోమందేపల్లిలోని దుర్గా నగర్లో మురుగు కాలువలు లేక రోడ్లపైకి నీళ్లు పారుతున్నాయి. మురుగు నీరు రోడ్లపైకి రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే మురుగు నీరు పోవడానికి కాలువలు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.