WNP: పెద్దమందడి మండలం జగత్ పల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త గౌనికాడి వెంకటేష్ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం సాయంత్రం ప్రభుత్వఆసుపత్రికి చేరుకొని వెంకటేష్‌ను పరామర్శించి ఆరోగ్యపరిస్థితిలను అడిగితెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా వైద్యులకు నిరంజన్ రెడ్డి సూచించారు.