VZM: జిల్లా ఎస్పీ ఆదేశాలతో పట్టణంలో ఉన్న అగ్నిమాపక సమీపంలో ఉన్న ఉల్లివీధి దగ్గర క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న సమాచారం మేరకు ఒకటో పట్టణ సీఐ శ్రీనివాస్, సిబ్బందితో సోమవారం దాడులు నిర్వహించారు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.