సత్యసాయి: పెనుకొండ నూతన డీఎస్పీగా నరసింగప్ప సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు సిబ్బంది స్వాగతం పలికారు. సబ్ డివిజన్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. డివిజన్ పరిధిలో ఉన్న పోలీసుల సహకారంతో సామాన్య మానవునికి న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ రత్నను నూతన డీఎస్పీ కలిశారు.