ASR: గ్రామాల్లో నెలకొన్న సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్ సూచించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం రాజేంద్రపాలెంలో సర్పంచ్ సింహాచలం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.