VSP: విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ కీలక నేతగా ఉన్న బెహరా భాస్కరరావు సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం నేరుగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణతో భేటీ అయ్యారు. దీంతో ఆయన జనసేనలో చేరడం ఖాయమని తెలుస్తోంది. జనసేనలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరువాతే ఆయన వైసీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.